రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు.. ఇత్తడి పాత్రలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

ప్రస్తుత కాలంలో ప్రజల జీవనశైలి దగ్గర నుంచి ఆహారపు ఆలవాట్ల వరకు  చాలా మార్పులు వచ్చాయి.

దీనికి తోడు ఇప్పుడంతా ఆహారంను  స్టీలు, అల్యూమినియంలోనే ఎక్కువగా వండుకుంటున్నారు.ఇక దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.

కానీ, పూర్వం మాత్రం ఎక్కువగా రాగి, ఇత్తడి మట్టి పాత్రల్లోనే వంటలు వండేవారు. అందువల్ల ఏ అనారోగ్య సమస్యలు కూడా వచ్చేవి కాదు.

కనుక ఆరోగ్యకరమైన ఆహారం తినడమే కాదు, ఎలాంటి పాత్రలు ఉపయోగిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం.

అయితే చాలామందికి ప్రతి రోజూ టీ తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది.

మరి ఆ టీని కాస్త చిన్న ఇత్తడి పాత్రలో చేసుకొని తాగితే రుచికి మాత్రమే కాదు ఆరోగ్యంకు కూడా చాలా మంచింది.

అయితే ఇత్తడి పాత్రల్లో టీ తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసుకుందాం.

ఇత్తడి పాత్రలో రోజు టీ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది.

అలాగే ఇత్తడి పాత్రల్లో మెలనిన్‌‌ను ఉత్పత్తి చేస్తాయి.కనుక ఇందులో టీ, పాలు, నీలు తాగడం వలన చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

పైగా హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తూ.. ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు పోయి చర్మం అందంగా మారుతుంది.

ఇక ఇత్తడిలో  ఉండే జింక్ రక్తాన్ని పెంచడానికి కూడా సహాయ పడుతుంది.పైగా రక్తంను శుద్ధి చేస్తుంది.

దీంతో పాటు ఇత్తడి పాత్రల్లో ఆహారాన్ని వండటం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు కూడా తగ్గుతాయి.