ఈ సూపర్ ఫుడ్ గురించి తెలుసా? ఆ విషయంలో మగాళ్లను బలంగా మార్చే సంజీవని!
ఈ రోజుల్లో పొద్దున లేచింది మొదలు అందరూ చదువు, ఉద్యోగం, వ్యాపారం అంటూ బిజీ అయిపోతున్నారు. ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక ఎవరికీ ఉండటం లేదు.
పని ఒత్తిడిలో పడి చాలా మంది తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు జీవనశైలి వ్యాధులు ఎక్కువైపోయాయి.
సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయకపోవడం, సరిపడా నిద్రపోకపోవడం వల్ల అనేక రకాల రోగాలు అందర్నీ చుట్టుముడుతున్నాయి.
ఇలాంటి రోగాలు మనుషుల్ని బలహీనంగా మారుస్తున్నాయి. వీటి బారిన పడి పురుషుల్లో శృ0గార సమస్యలు తలెత్తడం, సె*క్స్ సామర్థ్యం తగ్గడం ఎక్కువైపోయాయి.
ఈ నేపథ్యంలో మగాళ్లు ఆ విషయంలో మరింత దృఢంగా ఉండాలంటే బలమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కొలెస్ట్రాల్, ప్రొస్టేట్ క్యాన్సర్, మైగ్రేన్, లై0గిక సమస్యలు లాంటి లైఫ్ స్టైల్ రోగాల్ని తరిమి కొట్టాలంటే పురుషులు తమను తాము ఫిట్
గా ఉంచుకోవాలి.
అందుకోసం వ్యాయామం చేయడం, కంటికి సరిపడా నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి చేయాలి.
వీటన్నింటితో పాటు రోజువారీ భోజనంలో 5 రకాల సూపర్ ఫుడ్స్
ను తీసుకోవాలని హెల్త్ ఎక్స్
పర్ట్స్ సూచిస్తున్నారు.
మగాళ్లు తీసుకోవాల్సిన ఆహారాల్లో మొదటిది కొవ్వు చేపలు. వీటిల్లో ఉండే ప్రొటీన్లు కొత్త కణాల ఏర్పాటుకు ఉపయోగపడతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు మేలు చేస్తాయి.
కొవ్వు చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన గుండె, కండరాలను బలపరుస్తాయి.
పురుషులు తీసుకోవాల్సిన మరో ఆహారం పాలు. వీటిల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఎముకల అభివృద్ధికి ఇవి ఇతోధికంగా ఉపయోగపడతాయి. డైలీ మిల్క్ తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
పాల వల్ల హార్ట్ స్ట్రోక్ సమస్య కూడా తగ్గుతుంది. ఇందులోని మెగ్నీషియం, పెప్టైడ్
లు మన బాడీలోని గ్లూకోజ్, ఇన్సులిన్ సెన్సివిటీని బ్యాలెన్స్గా ఉంచుతాయి.
మగాళ్లు తప్పక తీసుకోవాల్సిన ఫుడ్స్
లో ఒకటి గుడ్లు.
వీటిలోని కాల్షియం, హెల్తీ ఫ్యాట్, కేలరీలు, సోడియం, పొటాషియం, ఐరన్, ప్రొటీన్, విటమిన్ డీ మన శరీరానికి చాలా మంచి చేస్తాయి.
పోషకాలు, ఖనిజాలు మెండుగా ఉండే పచ్చి కూరగాయలు కూడా పురుషులు రోజూ తీసుకోవాలి. ఇవి బాడీని హెల్తీగా ఉంచుతాయి.
గింజలు, విత్తనాలు కూడా మగాళ్లను బలంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఇందులో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి.
అలాగే పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని ఇవి తగ్గిస్తాయి.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం