ఈ 10 అడవుల గురించి తెలుసా? మానవ నాగరికత వీటిలోనే!

మానవ నాగరికతలో కీలకపాత్ర పోషించినవిగా అడవులను చెప్పొచ్చు. అడవులు, నదీ పరివాహక ప్రాంతాలను ఆధారంగా చేసుకునే మానవ జీవనం సాగింది.

ఇప్పటికి కూడా అడవులను ఆధారంగా చేసుకొని ఎంతో మంది జీవిస్తున్నారు. తనను నమ్ముకున్న వారిని అక్కున చేర్చుకొని ఆదరిస్తోంది అడవి తల్లి.

 ఆ దేశం, ఈ దేశం అనే తేడాలేదు.. ప్రపంచ దేశాలన్నీ అడవులు, నదుల ఆధారంగానే తమ నాగరికతను విస్తరించుకుంటూ ఇప్పుడు పట్టణ, నగర స్థాయికి చేరుకున్నాయి.  

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అడవులు ఉన్నాయి. అయితే వాటిల్లో నుంచి 10 అత్యంత పురాతన అడవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

క్వీన్స్ లాండ్, ఆస్ట్రేలియాలో విస్తరించిన డైనీ రెయిన్ ఫారెస్ట్ భూమ్మీద ఉన్న అత్యంత పురాతన అడవుల్లో ఒకటి. దాదాపు 180 మిలియన్ సంవత్సరాల కింద ఇది ఏర్పడిందని చెబుతారు.

బోర్నియో లోలాండ్ రెయిన్ ఫారెస్ట్ కూడా అత్యంత పురాతన అడవుల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది. ఈ అడవి 140 ఏళ్ల కింద ఏర్పడిందని అంటుంటారు.

మలేసియా, బ్రూనై, ఇండోనేసియా దేశాల గుండా బోర్నియో లోలాండ్ రెయిన్ ఫారెస్ట్ విస్తరించింది.

మలేసియాలోనే ఇంకో ఓల్డెస్ట్ ఫారెస్ట్ ఉంది. అదే తమనా నెగారా. ఇది సుమారు 130 ఏళ్ల కింద ఏర్పడినట్లుగా చెబుతారు. వందల రకాల జంతు జాతులు, వైవిధ్యమైన వృక్షాలకు దీన్ని ఆలవాలంగా పేర్కొంటారు.

అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కూడా ఎంతో విశిష్టత కలిగినది. 55 మిలియన్ సంవత్సరాల కింద ఏర్పడ్డ ఈ అడవి ఆధారంగా బ్రెజిల్, పెరూ, కొలంబియా, బొలీవియా, వెనిజులా, సురినేమ్, ఫ్రెంచ్ గయానా తదితర దేశాల నాగరికతలు పురుడు పోసుకున్నాయని చెబుతారు.

ఇరాన్, అజర్ బైజాన్ రీజియన్ లోని కాస్పియన్ హిర్కానియన్ మిక్స్డ్ ఫారెస్ట్ లు కూడా పురాతన అడవుల కిందకు వస్తాయి. ఇవి ఏర్పడి దాదాపు 25 నుంచి 50 మిలియన్ సంవత్సరాలు కావొస్తున్నాయి.

మడగాస్కర్ చుట్టూ విస్తరించిన రీయూనియన్ నేషనల్ పార్క్ కూడా ఓల్డెస్ట్ ఫారెస్ట్. రెండు నుంచి రెండున్నర మిలియన్ ఏళ్ల కింద ఇది ఏర్పడినట్లుగా చెబుతారు.

కెన్యాలోని కాకామెగా ఫారెస్ట్ కూడా ఎంతో విశిష్టత కలిగినది. 2 మిలియన్ సంవత్సరాల ఏర్పడిన ఈ పురాతన అడవి అందాలను చూడాలంటే టూరిస్ట్ గైడ్ సాయం తీసుకొని మాత్రమే వెళ్లాలి.

అమెరికాలోని పాండో అడవి 80 వేల ఏళ్ల కింద ఏర్పడిందని అంటుంటారు. 106 ఎకరాల్లో విస్తరించిన ఈ ఫారెస్ట్​లో ఎంతో పురాతన చెట్ల జాతులు ఉండటం విశేషం.

జపాన్ లోని యకుషిమా ఫారెస్ట్ 7 వేల ఏళ్ల కింద ఏర్పడిందని చెబుతారు. ఇందులోని పురాతన సెడార్ చెట్లకు చాలా ప్రాముఖ్యత ఉంది. వీటిని ఆ దేశం కాపాడుకుంటూ వస్తోంది.

 అమెరికాలోని బ్రిస్ట్ కోన్ పైన్ ఫారెస్ట్ కూడా చాలా పురాతనమైనది. 5 వేల ఏళ్ల కింద ఏర్పడ్డ ఈ అడవిని పర్యాటక ప్రాంతంగా ఆ దేశ సర్కారు తీర్చిదిద్దింది.