సైలెంట్ హార్ట్ ఎటాక్ గురించి తెలుసా? ఈ 5 లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్..

నేటి ఆధునిక యుగంలో ఏజ్ తో సంబంధం లేకుండా వ్యక్తులు హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు.

గుండె పోటులో సైలెంట్ హార్ట్ ఎటాక్ ఉంటుందని మీకు తెలుసా? దాని లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సైలెంట్ హార్ట్ ఎటాక్ సంబంధించి, 5 లక్షణాల గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ రవీందర్ సింగ్ రావు వివరించారు. 

ఎలాంటి పని చేయకున్నా.. శరీరం ఎప్పుడూ అలసటగా అనిపించడం. ఈ లక్షణాలలో ఒకటి.

బలహీనమైన గుండె శరీరం నుంచి డైరెక్ట్ గా శక్తిని తీసుకుంటుంది. దాంతో నీరసం వస్తుంది.

శారీరక కదలికలు లేనప్పుడు కూడా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే.. అది సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణం కావొచ్చు.

చేతులు, మెడ, దవడ లేదా వీపు వంటి పైభాగంలో నొప్పి లేదా అసౌకర్యం ఉంటే.. ఈ లక్షణంగా అనుమానించాలి.

తరచుగా వికారం, తలనొప్పి ఉంటే.. అది కూడా నిశ్శబ్ద గుండె నొప్పి లక్షణంగా సందేహించాలి.

 గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, రక్తపోటు పడిపోతుంది.మైకం వస్తుంది.

ఇక మనం ఏం పని చేయకుండా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు విపరీతమైన చమటలు పడితే.. అది ఈ వ్యాధి లక్షణం కావొచ్చు.

 గుండె మీద ఒత్తిడి ఉన్నప్పుడు, శరీరం ఎక్కువగా చెమట పడుతుంది.

ఈ లక్షణాలు ఇతర లక్షణాలతో కలిసి ఉన్నప్పుడు వెంటనే చికిత్స తీసుకోవాలి.

గమనిక :   ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. మీకు ఏమైనా సమస్య వస్తే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.