మీకు చేతులు వణికే సమస్య ఉందా?.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే!

ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం, సరిపడ నిద్ర, ఒత్తిడి లేని జీవన విధానం ఉండాలి.

ఇప్పటి బిజీ లైఫ్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

చాలా మందికి చేతులు వణికే సమస్య ఉంటుంది.

ఏదైనా పని చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, టెన్షన్ పడ్డప్పుడు చేతులు వణుకుతుంటాయి.

నాడీ వ్యవస్థ పనితీరు కారణంగా ఈ సమ తలెత్తుతుందంటున్నారు నిపుణులు.

ఈ సమస్య పరిష్కారం కోసం కొన్ని వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు.

ఫింగర్ ట్యాప్ వ్యాయామంతో చేతి వేళ్లు కదలికలను నియంత్రించొచ్చు.

హ్యాండ్ డంబెల్ వ్యాయామం చేతులు వణికే సమస్యను పరిష్కరిస్తుంది.

నరాల అలసట, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

స్పాంజ్ బాల్ వ్యాయామం వల్ల చేతి వణుకు సమస్య నుంచి బయటపడవచ్చు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం