రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే

ఉద్యోగులు, కార్మికులు ఇలా ఎవరైనా మైండ్ రిలాక్స్ కోసం కాఫీలను తాగేస్తుంటారు.

కొంతమందికి కాఫీ తాగనిదే రోజు గడవదు.

కాఫీలో పొటాషియం, మెగ్నీషియం, పాంథోనిక్ యాసి, నియాసిన్, మెగ్నీషియం, మరియు రిబోఫ్లివిన్, వంటివి ఉంటాయి.

కాఫీలో ఉండే కెఫిన్ నర్వస్ సిస్టమ్ పై ప్రభావం చూపిస్తుంది.

కాఫీలో ఉండే కెఫీన్ బ్లాక్ అయిన నరాలను తెరచుకొనేలా చేసి నరాలను ఉత్తేజ పరుస్తుంది.

బ్రేయిన్, శరీరాన్ని యాక్టీవ్ గా చేస్తుంది. అటెన్షన్ ని కూడా పెంచుతుంది.

కాఫీని మితంగా తీసుకుంటే కాలేయానికి రక్షణ కలిగిస్తుంది.

మధుమేహం ఉన్నవారు సరైన మోతాదులో కాఫీ త్రాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయంటున్నారు నిపుణులు.

కప్పు కాఫీ త్రాగితే జీర్ణ క్రియలు బాగా జరిగి తక్షణ శక్తిని అందిస్తుంది. అలసటను తగ్గిస్తుంది.

సాధారణంగా రోజుకు రెండు కప్పుల కాఫీ తీసుకుంటే మంచిదే అంటున్నారు నిపుణులు.

మోతాదుకు మించి కాఫీ తీసుకుంటే గుండె సమస్యలు, నిద్రలేమి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం