వేసవిలో ఎక్కువగా చల్లని నీరు తాగుతున్నారా.. అయితే డేంజర్ లో పడినట్లే

ఈ వేసవికాలంలో  ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండటంతో  చాలా మంది చల్లని నీటిని తాగేందుకు ఇష్టపడతారు.

కానీ, ఆ చల్లని నీరు ఎక్కువగా చాలా ఆనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే.. ఈ చల్లని నీరు  అప్పటికప్పుడు చల్లగానే అనిపిస్తుంది. కానీ,  తర్వాత అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందట.

అలాగే చల్లని నీరు ఎక్కువగా తాగితే  బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుంది.

దీని వలన తలనొప్పి, సైనస్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చల్లని నీరు తాగితే కడుపులోని ఆహారం త్వరగా జీర్ణమవ్వదు. దీని వలన జీర్ణక్రియనకు ఎఫెక్ట్ వచ్చి కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు వస్తాయి.

దీంతో పాటు చల్లని నీరు తాగడం వల్ల గొంతు నొప్పి రావడంతో పాటు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుందట.

ఇక ఈ చల్లని నీటి వలన ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి గొంతు, ముక్కులో రద్దీ ఏర్పడుతుంది.

అలాగే చల్లని నీరు తాగితే హార్ట్ బీట్ తగ్గుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా బాడీలోని  నాడీ వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది. దీంతో పాటు  గుండె వేగం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం