వర్షాకాలంలో ఈ చిన్న పని చేయండి.. ఆస్పత్రికి వెళ్లే పనే ఉండదు!

వర్షాకాలం వచ్చింది అంటే అందరిలో ఒక భయం మొదలవుతుంది.

జోరు వానలకు ఇంటినిండా దోమలు వచ్చేస్తాయి.

అవి కుట్టాయి అంటే.. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వస్తాయి.

ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆస్పత్రికి పరుగులు పెట్టాల్సిందే.

అయితే వర్షాకాలంలో మీరు ఈ చిన్న పని చేశారు అంటే.. ఆ భయమే ఉండదు.

అదేంటంటే.. మీరు ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ని తినాలి.

అవును.. సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల మీ శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

వర్షాకాలంలో.. యాపిల్, దానిమ్మ, అరటి, బెర్రీ పండ్లు తినాలి.

ఈ పండ్లలో మీకు  యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

ఈ యాంటీ ఆక్సిడెంట్స్  రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి.

ఈ పండ్లను కలిపి.. వాటిలో బాదం పప్పులను సన్నగా తరిగి వేసుకుని తింటే ఇంకా మంచిది.

ఈ పండ్లు మీ జీర్ణ ప్రక్రియను కూడా మెరుగు పరుస్తాయి. తద్వారా మలబద్దకం తగ్గుతుంది.

వర్షాకాలంలో  ఇమ్యూనిటీ తగ్గితేనే ఇలాంటి జ్వరాలు సోకుతాయి.

అందుకే మీరు తప్పకుండా వర్షాకాలంలో పండ్లు తినాలి.. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం