బరువు తగ్గడంతో పాటు మెరిసే చర్మం కోసం ఇలా చేయండి!

డీటాక్స్‌ డ్రింక్స్‌.. బాడీలోని టాక్సిన్స్‌ని బయటికి పంపుతాయనే విషయం తెలిసిందే.

అలాంటి అద్భుతమైన డీటాక్స్‌ డ్రింక్‌ను కరివేపాకుతో కూడా కూడా చేసుకోచ్చు.

కరివేపాకు డీటాక్స్‌ డ్రింక్‌ తీసుకోవడం వల్ల చర్మకాంతితో పాటు బరువు కూడా తగ్గొచ్చు.

అందుకోసం ముందుగా.. అసలు కరివేపాకుతో డీటాక్స్‌ డ్రింగ్‌ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

కరివేపాకు డీటాక్స్‌ డ్రింక్‌ కోసం కావాల్సిన పదార్థాలు..

కరివేపాకు - 6 ఆకులు

నిమ్మకాయ - 1

జీలకర్ర - ఒక టీ స్పూన్‌

తేనె - ఒక టీ స్పూన్‌

నీరు - కావాల్సినంత

చల్లటి నీటిలో కరివేపాకు బాగా కడగాలి. జీలకర్రను పొడి చేసుకోవాలి.

ఓ గ్లాస్‌లో నిమ్మరసం, జీలకర్ర పొడి, కరివేపాకు, తేనె, నీరు కలపాలి.

దాన్ని అలానే 1 నుంచి 2 గంటల పాటు ఉంచాలి. ఒక రాత్రి మొత్తం ఉంచితే ఇంకా మంచిది.

ఉదయం.. ఈ రసాన్ని వడపోసి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

కరివేపాకు డీటాక్స్‌ డ్రింక్‌ వల్ల ట్యాక్సిన్స్‌ బయటికి వెళ్లడంతో పాటు బరువు కూడా తగ్గుతారు.