Green Blob

ఈ ఆహార పదార్థాలను అస్సలు ఫ్రిడ్జ్‌లో పెట్టకండి.. పెడితే నష్టమే

ఫ్రిడ్జ్ ఉన్నదే రోజుల తరబడి ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడానికి. కానీ కొన్నిటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఆ ఆహార పదార్థాలు వాటి అసలు గుణాన్ని కోల్పోతాయని చెబుతున్నారు.

ఫ్రిడ్జ్ లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు.

టమాటాలను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల రుచి తగ్గుతుంది. అందుకే బయటే ఉంచాలని చెబుతున్నారు.

బంగాళాదుంపలు ఫ్రిడ్జ్ లో పెడితే తియ్యగా అవుతాయి. పేపర్ బ్యాగ్ లో పెట్టి స్టోర్ చేస్తే పాడవ్వవు.

దోసకాయలను ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత పండిపోయి వాటిలో నీరు ఎక్కువగా చేరుతుంది.

ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెడితే రుచిని కోల్పోయే అవకాశం ఉంది. వీటిని బయట ఉంచినా పాడవ్వవు.

కాఫీ బిళ్ళలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కాఫీ రుచి మారిపోతుంది. దీని కంటే డబ్బాలో ఉంచి మూత గట్టిగా బిగిస్తే రుచి  మారదు.

కాజు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రిడ్జ్ లో కంటే బయట ఉంచడమే మంచిది. అలానే పీనట్ బటర్ 3 నెలల వరకూ పాడవదు.  

బ్రెడ్ ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. అలానే అరటి పండ్లు ఫ్రెష్ గా ఉండాలంటే ఫ్రిడ్జ్ లో కంటే బయటే ఉంచడం మేలు.