ఆరోగ్యవంతమైన కిడ్నీల కోసం ఈ ఆహార పదార్థాలు తీసుకోండి

మానవ శరీరంలో ఉన్న అవయవాల్లో మూత్రపిండాలు కీలకమైనవి.

కిడ్నీలు నిర్విరామంగా పనిచేస్తూ రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి రోజూ 7-8 గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివల్ల కిడ్నీలకు హాని కలిగించే విషపదార్థాలు శరీరం నుంచి సులభంగా బయటకు విసర్జించబడతాయి.

లావుగా ఉండే ఎర్రటి మిర్చీలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. ఇవి ఆక్సిడెంట్లలా పని చేస్తాయి. వీటిలో పొటాషియం తక్కువగా ఉండటం వల్ల కిడ్నీలకు మేలు చేస్తాయి.

వెల్లుల్లిని పచ్చిగా లేదంటే వంటల్లో భాగంగా తిన్నా ఫలితం ఉంటుంది. ఇవి రక్తాన్ని శుద్ది చేస్తాయి. కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు వెళ్లేలా వెల్లులి తోడ్పడుతుంది.

ఆపిల్ పండ్లను తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల వీటిల్లో ఉండే విటమిన్-బి, విటమిన్ డి కిడ్నీ జబ్బులను దూరం చేస్తాయి.

స్ట్రాబెర్రీలను తీసుకుంటే వీటిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో ఉండే మాంగనీస్, పొటాషియం కిడ్నీలు మెరుగ్గా పని చేసేలా తోడ్పడతాయి.

కాలిఫ్లవర్‌లో విటమిన్ కె, విటమిన్ సి, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. కాలిఫ్లవర్‌లో ఉండే సల్ఫర్, పొటాషియం శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతాయి. ఫలితంగా కిడ్నీల పని తీరు మెరుగవుతుంది.

ఆక్సలేట్ ఎక్కువగా ఉండే బచ్చలికూర, దుంపలు, గింజలు వంటి ఆహారాలు మితంగా తీసుకోవాలి. ఆక్సలేట్ మూత్రంలో కాల్షియంతో కలిసి రాళ్లను ఏర్పరుస్తుంది.