Off-white Banner

మీకు ఓటర్ స్లిప్ రాలేదా? ఏం పర్లేదు.. ఇలా చేయండి!

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసేందే

ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తికాగా..నాలుగో విడతకు రంగం సిద్ధమైంది

ఈ నేపథ్యంలోనే అధికారులు  ఓటర్ స్లిప్ ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు.

ఇంట్లో ఉన్న అర్హులైన ఓటర్ల అందరికీ ఓటరు స్లిప్ లను ఇస్తున్నారు

ప్రతి ఓటరుకు స్లిప్పులు అందేలా సూపర్వైజర్లు పర్యవేక్షణ చేస్తున్నారు.

కొన్ని కొన్ని కారణాలతో కొందరు ఓటర్ స్లిప్పులను పొందలేకపోతారు.

ఓటర్ స్లిప్పులు రానివారు కంగారు పడాల్సిన అవసరం లేదు.

ఓటర్ స్లిప్ లేని వారు పోలింగ్ రోజున బూత్ వద్ద అధికారులు హెల్ప్ లైన్ సెంటర్లలో అందిస్తారు.

 పోలింగ్ బూత్ వద్ద ఉన్న హెల్ప్ లైన్ లో మీ ఓటరు ఐడీ వివరాలు తెలిపితే సరిపోతుంది.

మీ వివరాలు తెలియజేస్తే.. అక్కడి అధికారి మీకు ఓటర్ స్లిప్ ను అందజేస్తారు.

ఈ స్లిప్పుతో పాటు ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డుతో మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

మొబైల్ యాప్‌, హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా కూడా మీ ఓటు వివరాలను తెలుసుకోవచ్చు.

మీ ఓటు వివరాలను ఎస్‌ఎంఎస్ ద్వారా పొందడానికి ఈసీ వెసులుబాటు కల్పించింది.