Tooltip

రూ.10 స్వీట్ కార్న్ తో.. ప్రాణాలు తీసే క్యాన్సర్ ని అడ్డుకోవచ్చని తెలుసా?

మొక్కజొన్న వలన శరీరానికి కావలసినంత పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వీటిలో మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్,ఫాస్పరస్,సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి.

ఈ స్వీట్ కార్న్ అనేది తరుచు తినడం వలన ఎముకులను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు కిడ్నీ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి. 

ఇక బరువు   తగ్గలనుకున్న వారు మీ రెగ్యులర్ డైట్ లో  స్వీట్ కార్న్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఎందుకంటే  ఒక కప్పు స్వీట్ కార్న్ లో 342 క్యాలరీలు ఉంటాయి.  

స్వీట్ కార్న్ అత్యధికంగా ఫైబర్  కలిగి ఉండటంతో ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి  మంచి కొలెస్ట్రాల్ లెవల్ కు సహాయపడుతుంది.

స్వీట్ కార్న్ లో ఉండే యాంటియాక్సిడెంట్స్  డిఫరెంట్ టైప్స్ క్యాన్సర్ లను నిరోధిస్తుంది. 

 స్వీట్ కార్న్ లో ఉండే ఫైటోకెమికల్స్ మధుమేహవ్యాధిని రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది.

స్వీట్ కార్న్ అనేది  తరుచు తినడం వలన  కంటి చూపు మెరుగుపడుతుంది.

దీనితో పాటు ముఖంపై ముడతలు రాకుండా ఎల్లప్పుడు కాంతివంతంగా యవ్వనంగా కనిపిస్తారు. 

ఇది గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేయడంతో పాటు,చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. 

ఈ స్వీట్ కార్న్ లో ఉండే ఫెరూలిక్ యాసిడ్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.

దీనిలో ఉండే విటమిన్ బి12 ఎనీమియాను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఈ స్వీట్ కార్న్ అనేది కొందరికి పడకపోవచ్చు. అలాగే కాళ్ల వాపులు ఉన్నవారు డాక్టర్ ను సంప్రాదించి మితంగా  తింటే మంచింది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం