మీకు అందుబాటులో ఉండే ఈ ఫుడ్.. లైంగిక సామర్థ్యం పెంచుతుంది తెలుసా?
ఈ మధ్య కాలంలో చాలా మంది లైంగిక సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు అంటున్నారు.
తినే ఆహారం, గాలి కాలుష్యం, పని ఒత్తిడి ఇలా ఎన్నో సమస్యల వల్ల లైంగికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు
డయాబెటీస్ ఉన్నవారు 50 నుంచి 60 శాతం వరకు సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారని నిపుణులు అంటున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులలో అంగస్తంభన, శ్రీఘ్రస్కలన సమస్య, సెక్స్ కోరికలు తగ్గడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆందోళన, అనుమానాలు, అంగస్తంభన లోపాలు మనిషిని మానసికంగా బలహీనం చేసి లైంగిక సామర్థ్యం తగ్గిస్తున్నాయి.
మన ఇంట్లో ఉండే ఫుడ్ తో లైంగిక సమస్యలకు చెక్ పెట్టవొచ్చు అని వైద్యులు చెబుతున్నారు
కోల్డ్ వాటర్ లో ఉండే చేప లో ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. జననేంద్రియాలకు రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది.
కుంకుమ పువ్వు స్త్రీ, పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంచి.. శృంగార జీవితం బాగుండేలా చేస్తుంది.
అత్తి పండ్లలో విటమిన్ A, B1,B2, కాల్షియం, మాంగనీస్, పొటాషియం ఉంటుంది.ఇది లైంగిక బలహీనతను తగ్గించి యాక్టీవ్ గా ఉంచుతుంది.
అవకాడో స్త్రీ, పురుషుల ఇద్దరికి లైంగిక సామర్థ్యం పెంచుతుంది.. ఇందులో బిటా కెరోటిన్, విటమిన్ ఇ, మెగ్నీషియం లైంగిక వాంఛను పెంచుతుంది.
ఓయిస్ట్రెస్
ఇది విచిత్రమైన టేస్ట్ కలిగి ఉంటుంది. ఇందులో ఉండే మోనోసాచురేటెడ్ ఆయిల్స్ లైంగిక జీవితానికి బాగా సహాయపడతాయి.
మకా రూట్.. మహిళలు హెర్బ్ అని పిలుస్తారు. ఇది లైంగిక సామర్థ్యం పెంచి దాంపత్య సుఖాన్ని అందించేలా చేస్తుంది.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం