దానిమ్మ ఆకులు ఆ సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తాయని మీకు తెలుసా?

దానిమ్మ కాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు అన్న విషయం అందరికి తెలిసిందే.

కానీ దానిమ్మ కాయలతో పాటుగా వాటి ఆకులు కూడా కొన్ని అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు.

గజ్జీ, తామర వంటి చర్మ సమస్యలతో బాధపడే వారు.. దానిమ్మ ఆకుల పేస్ట్ ను అప్లై చేస్తే ఆ సమస్య తగ్గుతుంది.

అలాగే శరీరం మీద ఉండే గాయాలు, పుండ్లపై దానిమ్మ ఆకులను ఉపయోగిస్తే త్వరగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్య, నోటి పుండ్లు లాంటి సమస్యలను దానిమ్మ ఆకు నయం చేస్తుంది.

దానిమ్మ ఆకు రసాన్ని నీటిలో  కలిపి.. రోజూ పుక్కిలిస్తూ ఉండాలి. దాంతో నోటి సమస్యలు దూరమవుతాయి.

ఈ ఆకుల పేస్ట్ ను మెుటిమలపై రాస్తే తగ్గుతాయి. 

అలాగే అజీర్ణం, మలబద్ధకం, విరేచనాలకు దానిమ్మ ఆకుల జ్యూస్ తాగితే తగ్గుతుందని నిపుణుల పేర్కొన్నారు.

గమనిక: పైన పేర్కొన్న చిట్కాలు పాటించే ముందు.. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ను సంప్రదించగలరు.