Thick Brush Stroke

ప్రాణాలు తీసే గుండె సమస్యలకి జాజికాయ ఔషధమని తెలుసా?

మనం ప్రతి రోజూ మనం ఉపయోగించే మసాలా దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి.

ఎక్కువగా ఈ జాజీకాయను  బిర్యానీ, వంటి మసాలా వంటల్లో ఉపాయోగిస్తారనే విషయం తెలిసిందే.

అయితే ఈ జాజీకాయ రుచికి మాత్రమే కాకుండా దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.

జాజీకాయలో ఫైబర్, థియామిన్, విటమిన్ బి 6, కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.

ఆయుర్వేదం ప్రకారం జాజీకాయతో వివిధ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 

జాజికాయలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీని వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్లు నొప్పులు వంటి సమస్యలను ఈజీగా దూరం చేసుకోవచ్చు.

ప్రతిరోజు గోరు వెచ్చని పాలల్లో కొద్దిగా జాజికాయ పొడిని కలిపి తీసుకుంటే.. కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి సులభంగా కంట్రోల్ అవుతాయి.

ఇక డిప్రెషన్, ఒత్తిడితో ఇబ్బంది పడేవారు జాజికాయ పొడిని తీసుకుంటే.. ఈ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టవచ్చు.

జాజికాయలో ఉండే గుణాల కారణంగా నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

జాజీకాయ పొడిని తీసుకుంటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జాజీకాయ వలన జలుబు, జ్వరం, వంటి సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారు పాలలో కాస్త జాజీకాయ పొడిని వేసుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది.

వీటితో పాటు కడుపు ఉబ్బరం, అజీర్ణం లాంటి అన్ని పొట్ట సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.

ఇక ముఖం పై మొటిమలు, మచ్చలతో బాధపడేవారు జాజీకాయ పొడిని పేస్ట్ లా రాసుకుంటే ఆ మచ్చలు తొలగిపోతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం