భారత్ నుంచి ఈ 12 దేశాలకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లొచ్చని మీకు తెలుసా? ఎంచక్కా బైక్ మీదే చుట్టి రావొచ్చు..

విదేశీ టూర్లకు వెళ్లాలని చాలా మందికి కోరికగా ఉంటుంది. 

విదేశీ టూర్లకు వెళ్లాలని చాలా మందికి కోరికగా ఉంటుంది. 

విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా విమానయానం చేయాల్సిందే అని అందరూ అనుకుంటూ ఉంటారు.

కానీ భారతదేశం నుంచి బై రోడ్ ద్వారా ఈ 12 దేశాలకు వెళ్లొచ్చని మీకు తెలుసా? అవేంటంటే?

పచ్చదనానికి, కొండలకు పెట్టింది పేరు వియత్నాం. మీకు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే.. 

ఇండియా నుంచి బై రోడ్డు ద్వారా ఈ దేశానికి వెళ్లొచ్చు.

భారత్ నుంచి థాయ్ లాండ్ కు కూడా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. మయన్మార్ నుంచి థాయ్ లాండ్ కు వయా మోరే ద్వారా వెళ్లొచ్చు. అయితే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా ఇ-వీసా ఉండాలి.

సునౌలి బోర్డర్ నుంచి ఇండియా పక్కనే ఉన్ననేపాల్ కు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ తో ఇక్కడ ఎంచక్కా తిరిగేయెుచ్చు.

భుటాన్ కు ఫుట్సోలింగ్ రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇండియన్స్ ఇక్కడ పర్యటించడానికి ఎలాంటి వీసా అక్కర్లేదు.

ఇటలీ దేశానికి కూడా రోడ్డు మార్గం ద్వారా వెళ్లొచ్చు. చైనా, కిర్గిజ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కెమిస్తాన్, ఇరాన్, టర్కీ, గ్రీస్ దేశాల మీదుగా ఇటలీ చేరుకోవచ్చు.

స్విట్టర్ లాండ్, మలేసియా, మయన్మార్, టిబెట్, శ్రీలంక దేశాలకు కూడా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.