ఇలా చేస్తే ఫ్రిడ్జ్‌లు మీ ఆహారాన్ని విషంగా మారుస్తున్నాయని తెలుసా?

ఒకప్పుడు గూట్లో దీపం నోట్లో ముద్ద అన్న చందంగా ఉండేది.

అంటే చీకటి పడేలోపు రాత్రి భోజనం ముగించి.. పడుకునే వారు.

అయితే సాంకేతికత పెరిగిన కొద్ది సౌకర్యాలు పెరిగి.. పద్దతులు మారాయి.

కరెంట్‌ కనుగొన్న తర్వాత అనేక ఆవిష్కరణలు వచ్చాయి.

టీవీ, ఫ్రిడ్జ్‌, ఏసీ, ఫ్యాన్‌.. మన జీవితాలను మరింత సౌకర్యవంతం చేశాయి.

ఒకప్పుడు ఆహార పదార్థాలు మిగిలితే.. వాటిని వేరే వాళ్లకు ఇచ్చే వారు.

కానీ ఫ్రిడ్జ్‌లు వచ్చాక.. రోజుల తరబడి వాటిని నిల్వ చేసుకుని తింటున్నాం.

కానీ ఫ్రిడ్జ్‌లు వచ్చాక.. అయితే ఫ్రిడ్జ్‌ వాడకంలో మనం చేసే కొన్ని తప్పిదాల వల్ల ఆహారం విషంగా మారుతుంది అంటున్నారు నిపుణులు.

కనుక.. అలాంటి ఫ్రిడ్జ్‌లలో ఆహారాన్ని నిల్వ ఉంచి తినడం మంచిది కాదంటున్నారు.

కొందరు మిగిలిన ప్రతి పదార్థాన్ని ప్రిడ్జ్‌లో పెట్టేసి మర్చిపోతుంటారు.

రోజుల తరబడి అది ఫ్రిడ్జ్‌లోనే ఉండి.. చెడిపోతుంది.

దాని పక్కన వేరే పదార్థాలను పెడితే.. అవి కూడా పాడయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

ఫ్రిడ్జ్‌లో ఒక్కో ఆహారం నిల్వ చేయడానికి ఒకొక్క గడువు ఉంటుంది.

కూరగాయలను 3-4 రోజులు, పండ్లను వారం పాటు,  గుడ్లు, మాంసం వంటి వాటిని మాత్రం రెండు రోజుల్లో తినాలి.

లేదంటే ఆ తర్వాత అవి మన ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారతాయని హెచ్చరిస్తున్నారు.

ఫ్రిడ్జ్‌ను సరిగా శుభ్రం చేయకపోయినా.. గాలి సోకే అవకాశం లేకపోయినా..

దానిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉండి.. ఆహారాన్ని పాడు చేస్తుందని అంటున్నారు.

ఫ్రిడ్జ్‌లో ఎక్కువ కాలం ఉంచిన ఆహారంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరుగుతుందని..

దాన్ని తింటే.. అది మన శరీరంలోకి వెళ్లి రకరకాల వ్యాధులను కలిగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.