ఉప్పు వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా? రోజులో ఎంత తీసుకోవాలి?

ఉప్పు నిత్యం మన ఆహారంలో భాగంగా ఉంటుంది.

ఉప్పు లేకుంటే ఎంత మంచి కూరైన రుచీపచి ఉండదని అంటూ ఉంటారు.

అయితే.. ఉప్పును మితిమీరి తింటే మాత్రం చాలా డేంజర్‌.

ఉప్పు ఎక్కువగా తింటే.. గుండె జబ్బులు, బీపీ వస్తుందని తెలిసిందే.

మితిమీరిన ఉప్పు వినియోగం.. గుండె పోటుకు దారితీయొచ్చు.

ఉప్పులో 40 శాతం సోడియం ఉంటుంది. మిగిలిందంతా క్లోరైడ్‌.

శరీర కణాల్లో ప్లాస్మాను నిర్వహించడానికి, లవణాలు కణాల పనితీరును సమతుల్యం చేయడానికి సోడియం ఉపయోగపడుతుంది.

ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య కూడా తలెత్తవచ్చు.

మరి ఎంత ఉప్పు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఒక వ్యక్తి 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తినాలి.

2 నుంచి 3 ఏళ్ల పిల్లకు ఇచ్చే ఆహారంలో వీలైనంత తక్కువ ఉప్పు ఉండేలా చూసుకోవాలి.

గర్భిణీలు 1500 మిల్లీ గ్రాముల ఉప్పు తీసుకోవచ్చు.

అయోడైజ్డ్‌ ఉప్పు వాడాలి.