వానాకాలంలో వ్యాపిస్తున్న కండ్లకలక.. ఇలా చేస్తే అస్సలు రాదు!

గతకొద్ది రోజులే నుంచి వానలు విస్తారంగా కురుస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇది ఇలా ఉంటే..వానాకాలంలో అనేక రకలా వ్యాధులు ప్రభలుతుంటాయి.

అలా వర్షాలకు వచ్చే వ్యాధుల్లో కండ్లకలక కూడా ఒకటి.

వానాకాలం ఎక్కువ మందిలో కండ్లకలక సమస్య కనిపిస్తుంది.

అయితే కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా కండ్లకలకను నివారించవచ్చు.

మన చేతులను నిత్యం శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా నివారించవచ్చు

ఈ క్రమం రోజు చాలా సార్లు కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడుకోవాలి

కళ్లు దురదపెట్టినప్పుడు చేతితో నలపడం చేయకూడదు

మెత్తనైన టవల్, ఇతర వస్త్రాన్ని వినియోగించి కంటిని శుభ్రం చేసుకోవాలి

అలానే టీవీ, స్మార్ట్ ఫోన్, ల్యాప్ ట్యాప్ వినియోగాన్ని తగ్గించడం కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

ఎక్కడ పడితే అక్కడి నీళ్లతో కళ్లను శుభ్రచేయకూడదు.

గోరు వెచ్చని నీరు, చల్లనీరు ఉపయోగించి.. కళ్లను  పరిశుభ్రంగా ఉంచొచ్చు.

ఇలా వివిధ రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కండ్లకలక రాకుండ చూసుకోవచ్చు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం