శీతాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే..  ఆరోగ్యం మీ సొంతం

సాధారణంగా శీతాకాలం సీజన్ వచ్చిందంటే చాలు రక రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి.

జలుబు, దగ్గు, శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి.

శీతాకాలంలో ఎక్కువగా పొగమంచు, అల్జీలు, చలిగాలులు, దూళి కారణంగా అరోగ్య సమస్యలు తలెత్తుతాయి వైద్యులు చెబుతున్నారు.

చలికాలంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి అనారోగ్యాలు మీ దరిచేరవు

ఇటీవల కొత్త కొత్త వైరస్ లు వస్తున్నాయి.. చలికాలంలో వాటి తీవ్రత ఎక్కువ అందుకే తప్పకుండా మాస్క్ ధరించాలి.

ఈ సీజన్ లో హైడ్రేటెడ్ గా ఉంటే చాలా మంచింది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

చలికాలం చలి భయంతో చాలా మందికి బయటికి రారు.. దీని వల్ల సూర్యరశ్మి ద్వారా వచ్చే విటమిన్ డీ కోల్పోతారు. ఇమ్యూనిటీ కోల్పోతారు.

శీతాకాలం ఐరన్, క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం అంటే మాంసం, చేపలు, చిక్కుడు, తాజా కూరగాయలు, పండ్ల లో విటమిన్ సీ సమృద్దిగా ఉంటుంది.

సాధ్యమైనంత వరకు వ్యాయామం, యోగా చేయడం మంచింది.. దీనివల్ల శారీరక,మానసిక ధృడత్వం ఏర్పడుతుంది.

శీతాకాలంలో సరైన నిద్ర పోకపోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని, ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.  

ఆల్కాహాల్, కెఫిన్ తీసుకోవడం మానేస్తే చాలా బెటర్.. ఒకవేళ వేడి టీ, కాఫీ తాగేవారు కొంత కంట్రోల్ చేసుకుంటే మంచింది అంటున్నారు నిపుణులు

శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, ఉన్ని దుస్తులు వాడితే మంచింది. బ్యాక్టీరియా, వైరస్ వంటివి వ్యాప్తి చెందకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

శీతాకాలంలో దొమల బెడద తీవ్రంగా ఉంటుంది.. దోమతెర, మస్కిటో కాయిల్స్, మస్కిటో బ్యాట్స్ లాంటివి వాడుతూ దోమలు రాకుండా చూసుకోవాలి.