బెల్లంతోపాటు వీటిని కలుపుకుని తింటే.. ఆ సమస్యలు దరిచేరవు!

బెల్లాన్ని శుభకార్యాల్లో కూడా వినియోగిస్తుంటారు.

బెల్లంలో కాల్షియం, ఐరన్, విటమిన్లు ఇలా ఎన్నో పోషాకలు ఉన్నాయి.

భోజనం చేసిన తర్వాత బెల్లాన్ని తింటే ఎముకలు దృఢంగా తయారవుతాయి.

అయితే బెల్లాన్ని పసుపతో కలిపి తీసుకుంటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

బెల్లాన్ని పసుపుతో కలిపి తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

దీన్ని తినడం వల్ల జీర్ణ సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు.

పసుపు, బెల్లం రెండూ డైజెస్టివ్ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.

బెల్లం పేగు కదలికలను ప్రేరేపిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది.

బెల్లాన్ని క్రమం తప్పకుండా తింటే రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు.

బెల్లం, నెయ్యి సమపాళ్ళలో కలిపి తింటే తల నొప్పి తగ్గుతుంది.

గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసిఆకులు వేసి తీసుకుంటే పొడిదగ్గు సమస్యకు చెక్ పెట్టొచ్చు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం