దాల్చిన చెక్క.. అలాంటి వారికి వరం!
డాక్టర్స్ దాచిన
సంజీవని!
సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన
దాల్చిన చెక్కలో
దివ్యమైన ఔషద గుణాలు దాగున్నాయంటున్నారు నిపుణులు.
దాల్చిన చెక్కను ఆయుర్వేద ఔషదాల
తయారీలో ఉపయోగిస్తారు.
వంటకాల్లో వాడే
మసాలా దినుసుల్లో దాల్చిన చెక్కను
వినియోగిస్తారు.
వంటల రుచిని పెంచే
దాల్చిన చెక్క
ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా
మధుమేహులకు
దివ్యమైన ఔషదంగా పనిచేస్తుంది.
దాల్చిన చెక్కలో
యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు
అనేక సమస్యలను దూరం చేస్తాయి.
దాల్చినచెక్కలో
యాంటీ మైక్రోబియల్ లక్షణాలు
ఉన్నాయి. ఇవి
జీర్ణక్రియకు
సంబంధించిన సమస్యలను తొలగిస్తాయి.
దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల
మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం
లాంటి సమస్యలు దూరమవుతాయి.
దాల్చిన చెక్క
రక్తంలో చక్కెర స్థాయిని
అదుపులో ఉంచుతుంది.
రోజూ దాల్చిన చెక్కను తీసుకుంటే
మధుమేహం
అదుపులో ఉంటుంది.
దాల్చిన చెక్క
కొలెస్ట్రాల్‌ను
అదుపులో ఉంచుతుంది.
దాల్చిన చెక్క
బరువును తగ్గించడంలో
ప్రభావవంతంగా పనిచేస్తుంది.
దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల
కీళ్ల నొప్పుల సమస్య
నుంచి బయటపడవచ్చు.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం