చూయింగ్ గమ్ తింటున్నారా? మీ హార్ట్ డేంజర్ లో ఉన్నట్లే!

చూయింగ్ గమ్ తినే అలవాటు చాలా మందిలో చూస్తుంటాం. కొందరు సరదా కోసం దీన్ని తింటే మరికొందరు స్టైల్ గా ఉంటుందని నములుతుంటారు.

ముఖ్యంగా యువత ఎక్కువగా చూయింగ్ గమ్ లు తినడం చూస్తుంటాం. పిల్లలు, యూత్ లో ఇదో అలవాటుగా మారడాన్ని గమనించొచ్చు.

చూయింగ్ గమ్ వల్ల లాభాలను పక్కనబెడితే దీని వల్ల కలిగే దుష్ప్రయోజనాలు ఏంటో తెలిస్తే..  మళ్లీ దాని జోలికి వెళ్లరు.

చూయింగ్ గమ్ లో పలు కృత్రిమ తీపి పదార్థాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు.

ఇందులోని తీపి పదార్థాలు రక్తం గడ్డకట్టేలా చేయడం ద్వారా  మన శరీర ఆరోగ్య వ్యవస్థకు తీవ్ర హాని కలిగిస్తాయి.

హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి హృదయ సంబంధిత ప్రమాదాలను ఇది పెంచుతుందని తాజా స్టడీ చెబుతోంది.

ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ ను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్యాలు దరిచేరతాయని హెచ్చరిస్తోంది. 

బబుల్ గమ్స్ లో ఉపయోగించే చక్కెర ప్రత్యామ్నాయమైన జిలిటాల్ వల్ల గుండెకు ముప్పు పొంచి ఉందని యూరోపియన్ హార్ట్ జర్నల్ అధ్యయనం వెల్లడించింది. 

చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే జిలిటోల్ వాడకం మోతాదుకు మించితే ఆరోగ్య సమస్యలు తప్పవని ఈ స్టడీ స్పష్టం చేసింది.

జిలిటోల్ అధిక వినియోగం మంచిది కాదని.. దీని వల్ల రక్తం గడ్డకట్టి హృదయనాళ సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.

జిలిటోల్ వల్ల రక్తం గడ్డకట్టే సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని USకు చెందిన క్లీవ్ ల్యాండ్ క్లీనిక్ తెలిపింది.

హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారు చూయింగ్ గమ్ కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఆర్టిఫిషియల్ స్వీట్​నర్స్​ కంటే న్యాచులర్ స్వీట్​నర్స్​ను ఎంచుకోవడం ఉత్తమం అని  ఎక్స్​పర్ట్స్ సూచిస్తున్నారు.