ఇంట్లో పిల్లలను ఒంటరిగా వదలి వెళ్తున్నారు..ఈ జాగ్రత్తలు ముఖ్యం!

ఇంట్లో పిల్లలకు అమ్మమ్మలు, తాతయ్యలు రక్షణగా ఉండే రోజులు పోయాయి.

నేటికాలంలో భార్యాభర్తలు జాబు చేస్తూ పిల్లల్ని చూసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలోనే కొన్ని సార్లు ఒంటరిగా పిల్లల్ని ఇంట్లో వదిలి వెళ్లక తప్పడం లేదు.

పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్లేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

కొన్ని వస్తువుల జోలికి పిల్లలను పోవద్దని.. అవి ఎలాంటి ప్రమాదాలు కలుగజేస్తాయో  వివరించాలి.

ఇంట్లో పిల్లల్ని వదిలి వెళ్లేప్పుడు తప్పనిసరిగా గ్యాస్‌ను, అనవసరంగా ఆన్‌లో ఉన్న స్విచ్‌లను ఆఫ్‌ చేసి వెళ్లాలి.

ఒక ఫోన్‌ ఇంట్లో వదిలి, దానికి స్క్రీన్‌ లాక్‌ ఉంటే ఎలా తీసి కాల్‌ చేయాలో నేర్పించాలి.

తల్లిదండ్రుల నంబర్లు పిల్లలకు వచ్చి ఉండేట్టు చూడాలి.

 ఫ్రిజ్‌ మీద కూడా ముఖ్యమైన నంబర్లను కాగితం మీద రాసి అంటించి ఉంచవచ్చు.

తలుపు ఎవరికి తీయాలి, ఎవరికి తీయకూడదు అనే విషయం పిల్లలు తెలిసేలా చేయాలి.

తలుపు లోపలి నుంచి గడి పెట్టుకోవడం, లేదా గ్రిల్‌కు తాళం వేసి పెట్టుకోవడం నేర్పాలి.

పిల్లలు  ఒంటరిగా ఉన్నప్పుడు  హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని సినిమా, కంప్యూటర్‌ ఫోన్‌ చూడటాన్ని నిషేధించాలి.

అంతేకాక మరికొన్ని జాగ్రత్తలను కూడా పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లినప్పుడు తీసుకోవాలి.