చియా సీడ్స్ vs అవిసె గింజలు.. రెండింట్లో ఏది బెస్ట్? ఏది ఎక్కువ ఆరోగ్యం?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ఇప్పుడు అందరూ దృష్టి పెడుతున్నారు. కరోనా వల్ల హెల్త్ ఎంత ఇంపార్టెన్స్ ఏంటనేది అందరికీ తెలిసొచ్చింది.

ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడం కోసం ఎక్సర్ సైజులు చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

పౌష్టికాహారంలో భాగంగా జీడిపప్పులు, బాదంపప్పులు, వాట్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తో పాటు చియా గింజలు, అవిసె గింజల్ని కూడా విరివిగా తింటున్నారు.

బరువు తగ్గాలనుకునే వారు  చియా సీడ్స్, అవిసె గింజల్ని ఎక్కువగా వాడుతున్నారు. వీటిలో ఉండే పోషకాలు, ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.  

చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెస్ట్? దేన్ని తీసుకుంటే బెటర్? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో వీటి గురించి మరింతగా తెలుసుకుందాం..

 చియా సీడ్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటి వల్ల జీర్ణక్రియ మెరుగవడమే గాక రక్తంలో చక్కెర స్థాయులు కూడా నియంత్రణలో ఉంటాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

చియా విత్తనాల్లో ఉండే ఒమేగా  త్రీ  ఫ్యాటీ ఆమ్లాల వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు.

ఈ విత్తనాలు క్రమం తప్పకుండా తినడం వల్ల ఇన్ ఫ్లమేషన్ ప్రాబ్లమ్ కూడా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు.

చియా సీడ్స్ కంటే అవిసె గింజలు ఆకారంలో కాస్త పెద్దవిగా ఉంటాయి. ప్రొటీన్, ఫైబర్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, మాంగనీస్ ఇందులో మెండుగా ఉంటాయి.

అవిసె గింజల్లోని ఫైబర్ బరువును అదుపులో ఉంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

 అవిసె గింజలు తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్ల బారి నుంచి రక్షణ పొందొచ్చని చెబుతున్నారు.

చియా సీడ్స్-అవిసె గింజలు.. ఈ రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవేనని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. వీటితో ఎన్నో ఆర్యోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. కాబట్టి ఇవి రెండూ తీసుకోవడం మంచిదేనని చెబుతున్నారు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం