Tooltip

వేపాకు నమిలి చూడండి! లైఫ్ లో డెంటిస్ట్ అవసరం ఉండదు!

ఎన్నో ఔషధ గుణాలు కలిగివున్న వేపను ప్రాచీన కాలం నుంచి పలు చికిత్సల్లో, ఔషధంగా వినియోగిస్తున్నిరు.

వేప ఆకు నుంచి పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు, బెరడు వరకు ఇలా అన్నింటిని పలు వ్యాధుల చికిత్సలో, శరీర సౌందర్యానికి వినియోగిస్తుంటారు.

వేప ఆకులో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఇనుము, కాల్షియం, ఫైబర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.

అలాగే వేపాకులు  రక్తంలోని మలినాలను తొలగించి రక్తన్ని శుద్ధిచేస్తాయి.

పరగడుపున వేప ఆకులు తినడం వల్ల హానికారిక బ్యాక్టీరియాతో పోరాడేందుకు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

క్యాన్సర్ బారిన పడకుండా వేపాకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.

చుండ్రు సమస్యకు వేపాకు పేస్ట్ దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

చర్మ సమస్యలు, దద్దుర్లు, దురద, మెటిమలు వంటి ఇబ్బందులను నివారించేందుకు వేపాకు పేస్ట్ మంచిగా పనిచేస్తుంది.

వేపాకులు కడుపులోని అల్సర్లను, గ్యాస్ ను, కంటి రుగ్మతలను, గుండె మరియు రక్తనాళాల సమస్యలను ఇట్టే తొలగిస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ వేపాకు ఎంతగానో ఉపాయోగపడుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం