సరిగా నిద్రపోకపోతే డయాబెటిస్ వస్తుందా? పరిశోధనలో తేలింది ఏంటంటే?
నిద్రకి, డయాబెటిస్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా?
నిద్రపోయే సమయం హెల్త్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు 2 లక్షల 48 వేల మందిపై ఒక సర్వే నిర్వహించారు.
ఈ సర్వేలో తక్కువ నిద్రపోయిన వారికి టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది.
రోజుకు 3 నుంచి 5 గంటల మధ్య నిద్రపోయే వారికి ఈ సమస్య ఎక్కువ ఉన్నట్లు తేలింది.
ఒక మనిషి 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని.. కనీసం 7 గంటలైనా నిద్రపోతే హెల్త్ సమస్యలు తగ్గుతాయని అంటున్నారు.
7 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే డయాబెటిస్ తో పాటు ఊబకాయ సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు.
తక్కువ సేపు నిద్రపోతే ఆకలి ఎక్కువ వేస్తుంది. దీని వల్ల ఎక్కువ ఆహారం తీసుకుంటారు.
నిద్ర సమయం కరెక్ట్ గా మెయింటెయిన్ చేయనివారికి ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరని పరిశోధనలో తేలింది.
శరీరంలో కీలక మార్పులు జరిగేది నిద్రపోయినప్పుడే. ఐతే సరైన నిద్ర లేకపోతే ఆ మార్పులు జరక్క బరువు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు.
తగినంత సమయం నిద్రపోకపోతే ఇన్సులిన్ లెవల్ తగ్గి.. గ్లూకోజ్ లెవల్స్ పెరిగిపోయి డయాబెటిస్ కి కారణమవుతుందని అంటున్నారు.
కాబట్టి సరిగ్గా నిద్రపోతే ఈ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం