Tooltip

షుగర్‌ పేషెంట్స్‌ మామిడి పండ్లు తినొచ్చా.. వైద్యులేమంటున్నారు!

షుగర్‌ పేషెంట్స్‌ మామిడి పండ్లు తినొచ్చా.. వైద్యులేమంటున్నారు!

వేసవి కాలం అనగానే అందరికి మండే ఎండలతో పాటుగా మామిడి పండ్లు కూడా గుర్తుకు వస్తాయి.

వేసవిలో ఎండలతో పాటుగా ఈ సీజన్‌లో మాత్రమే దొరికే కొన్ని ఆహార పదర్థాలు చాలా ప్రత్యేకం.

మామిడి ప్రియులు వేసవి కాలం కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తారు.

పండ్లలో రారాజు.. మామిడిని రుచి చూడాలంటే.. వేసవిలో మాత్రమే సాధ్యం.

మామిడి పండ్లను ఇష్టపడని వారు చాలా అరుదు అని చెప్పవచ్చు.

మామిడి పండ్లతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.

 వీటిలోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని  కాపాడతాయి.

అయితే కొన్ని రకాల వ్యాధులతో బాధపడే వారు మామిడి పండ్లను తీసుకోవాలా వద్దా అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి.

వీరిలో ముఖ్యంగా చెప్పుకొవాల్సింది డయాబెటిస్‌ రోగుల గురించి.

మధుమేహంతో బాధపడేవారు మామిడి పండ్లు తింటే డేంజర్‌లో పడ్డట్లే అని భావిస్తారు.. భయపడతారు.

 తియ్యగా ఉండే ఈ పండ్లతో షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంటుందని చాలా మంది నమ్మకం.

అయితే ఇందులో నిజమెంత.. నిజంగానే మామిడి పండ్లు తింటే షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయా..

అసలు షుగర్‌ ఉన్న వాళ్లు మామిడి పండ్లు తినవచ్చా.. నిపుణులు ఏం అంటున్నారంటే..

షుగర్‌ బాధితులు మామిడి పండ్లను తీసుకుంటే తరచూ వారి రక్తంలో షుగర్‌ లెవల్స్‌ని చెక్‌ చేసుకోవాలని చెబుతున్నారు.

ఒకవేళ మామిడి పండ్లను తీసుకున్న తర్వాత షుగర్‌ లెవల్స్‌ పెరిగితే మాత్రం వాటికి దూరంగా ఉండడమే మంచిదంటున్నారు.

అంతేకాక భోజనం చేసిన వెంటనే.. అలానే పరగడుపన మామిడి పండ్లను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇలా చేస్తే..షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం