ఇలా చేస్తే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఇట్టే మాయమైపోతుంది.

సరైన ఆహరం, జీవనశైలి లేక ఇప్పుడు చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు.

ఇందులో రెండు రకాలు ఉంటాయి.. ఒకటి మంచి కొలెస్ట్రాల్ , రెండు చెడు కొలెస్ట్రాల్.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు అది.. అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

కాబట్టి  వీలైనంత త్వరగా.. దానిని నియంత్రించుకోవడం మంచిది. దాని కోసం ఇలా  చేయండి.

చియా గింజలను పెరుగుతో కలిపి తినడం వలన చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో  ఉపయోగపడుతుంది.

వీటిలో ఫైబర్  బాగా ఉంటుంది. కాబట్టి, ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి.. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది.

ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో  చియా గింజలను, పెరుగును కలిపి తీసుకోవడం వలన ఎక్కువ లాభం ఉంటుంది.

అలాగే బొప్పాయి, జామ, ఆపిల్, స్ట్రాబెరీ, ఆరెంజ్, అవకాడో లాంటి పండ్లను తరచూ తింటూ ఉండాలి.

 శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి పండ్లు కూడా బాగా ఉపయోగపడతాయి.

వీటితో పాటు ఓట్స్ ను కూడా ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి..

దీని వలన 25 నుండి 35 గ్రాముల ఫైబర్ శరీరానికి లభిస్తుంది. దీనితో అవి కొవ్వు కరిగించడానికి ఎంతో ఉపయోగపడతాయి.

కాబట్టి ప్రతి రోజు ఉదయం  బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తీసుకోవడం వలన ఎక్కువ లాభం ఉంటుంది.

ఇక చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ముందుండేవి చిరు ధాన్యాలు.

బీన్స్ , బార్లీ గింజలు , రాగులు , జొన్నలు వీటిని ఆహారంలో భాగం చేసుకున్నా కానీ మంచి రిసల్ట్ కనిపిస్తుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం