వరల్డ్‌  నెం.1  టెస్ట్‌ బౌలర్‌గా  బుమ్రా!

టీమిండియా స్టార్‌ పేసర్‌ బుమ్రా వరల్డ్‌ నెం.1 టెస్ట్‌ బౌలర్‌గా నిలిచాడు.

తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 881 పాయింట్లతో ఫస్ట్‌ ప్లేస్‌ ఆక్రమించాడు.

ఇటీవల ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు.

పటిష్టమైన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ను కుప్పకూల్చుతూ.. ఏకంగా 9 వికెట్లతో సత్తా చాటాడు.

దీంతో.. తన పాయింట్లను మెరుగుపర్చుకుని.. నంబర్‌ వన్‌ స్థానాన్ని అధిరోహించాడు.

ఈ క్రమంలోనే ఓ అరుదైన ప్రపంచ రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.

 మూడు ఫార్మాట్లలోనూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా నిలిచిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

ప్రపంచంలో మరే బౌలర్‌ కూడా మూడు ఫార్మాట్లలో నంబర్‌ వన్‌ కాలేదు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ముగ్గురు బ్యాటర్లు మాత్రమే మూడు ఫార్మాట్లలో నంబర్‌ వన్‌ స్థానాల్లో కొనసాగారు.

గతంలో మ్యాథ్యూ హేడెన్‌, రికీ పాంటింగ్‌, విరాట్‌ కోహ్లీ మాత్రమే ఈ ఘనత కలిగి ఉన్నారు.

ఇప్పుడు బుమ్రా టెస్ట్‌, వన్డే, టీ20 ఫార్మాట్లలో నెం.1 ప్లేస్‌లో నిలిచిన తొలి బౌలర్‌గా అవతరించాడు.

 బుమ్రా టెస్టుల్లో నెం. 1 బౌలర్ గా ఉండగా.. గతంలో వన్డేల్లో, టీ20ల్లో అగ్రస్థానం ఆక్రమించిన విషయం తెలిసిందే.

 తన కెరీర్‌లో 34 టెస్టులు ఆడిన బుమ్రా 64 ఇన్నింగ్స్ ల్లో 152 వికెట్లను పడగొట్టాడు.