బుజ్జి & భైరవ ఇప్పుడు OTT లో కూడా వీరి గురించే టాక్..

కల్కి 2898 AD సినిమా గురించి ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వింటూనే ఉన్నాము.

ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుందా అని అందరు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇటీవల  బుజ్జి & భైరవ గురించి వచ్చిన అప్ డేట్స్  ట్రెండింగ్ లోకి వచ్చేశాయి.

తాజాగా రిలీజ్ చేసిన  బుజ్జి & భైరవ ట్రైలర్ కూడా ప్రేక్షకులను తెగ మెప్పించేసింది.

ఇప్పుడు బుజ్జి & భైరవ పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్ .

 ఈ యానిమేటెడ్ సిరీస్ ఆల్రెడీ  OTT లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ తెలుగు,  హిందీ, ఇంగ్లీష్ , స్పానిష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సిరీస్ లో బుజ్జి , భైరవల పాత్రల నేపథ్యం, కల్కి ప్రపంచం గురించి చూపించడం జరిగింది.

ఈ సిరీస్ మొత్తంగా నాలుగు ఎపిసోడ్స్ గా రూపొందించారు మేకర్స్ .

కల్కి అసలు కథ తెలియాలంటే ముందు ఈ యానిమేటెడ్ సిరీస్ ను చూడాల్సిందే.

కల్కి 2898 AD రిలీజ్ కు ఇంకా సమయం ఉంది కాబట్టి .. ఈలోపు ఈ సిరీస్ మిస్ కాకుండా చూసేయండి.