బుజ్జి & భైరవ ఇప్పుడు OTT లో కూడా వీరి గురించే టాక్..
కల్కి 2898 AD
సినిమా గురించి ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వింటూనే ఉన్నాము.
ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుందా అని అందరు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇటీవల
బుజ్జి & భైరవ
గురించి వచ్చిన అప్ డేట్స్ ట్రెండింగ్ లోకి వచ్చేశాయి.
తాజాగా రిలీజ్ చేసిన
బుజ్జి & భైరవ
ట్రైలర్ కూడా ప్రేక్షకులను తెగ మెప్పించేసింది.
ఇప్పుడు
బుజ్జి & భైరవ
పేరుతో ఓ
యానిమేటెడ్ సిరీస్
ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్ .
ఈ యానిమేటెడ్ సిరీస్ ఆల్రెడీ
OTT లో స్ట్రీమింగ్
కు వచ్చేసింది.
ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్
అమెజాన్ ప్రైమ్
లో ఈ సిరీస్
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ , స్పానిష్
భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సిరీస్ లో
బుజ్జి , భైరవల
పాత్రల నేపథ్యం, కల్కి ప్రపంచం గురించి చూపించడం జరిగింది.
ఈ సిరీస్ మొత్తంగా
నాలుగు ఎపిసోడ్స్
గా రూపొందించారు మేకర్స్ .
కల్కి అసలు కథ తెలియాలంటే ముందు ఈ
యానిమేటెడ్ సిరీస్
ను చూడాల్సిందే.
కల్కి 2898 AD
రిలీజ్ కు ఇంకా సమయం ఉంది కాబట్టి .. ఈలోపు ఈ సిరీస్ మిస్ కాకుండా చూసేయండి.