గేమింగ్ ప్రియుల బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. మతిపోగొట్టే ఫీచర్స్

స్మార్ట్ ఫోన్ ని గేమ్స్ కోసం ఎక్కువగా వాడేవారు ఉంటారు. అయితే ఆ వాడకాన్ని తట్టుకోవాలంటే అల్లాటప్పా ఫోన్లు పనికిరావు.

అయితే రియల్ మి ఇప్పుడు సరికొత్త గేమింగ్ స్మార్ట్ ఫోన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది రియల్ మి ఫోన్లకి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అలానే క్రేజ్ కూడా ఉంది.

బడ్జెట్ లో ఫోన్స్ ని తయారుచేయడంలోనే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ముందుంటుంది.  

రియల్ మి జీటీ 6టీ 5జీ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ని రీసెంట్ గా భారత మార్కెట్లో లాంఛ్ అయ్యింది.  స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ తో, 5500 ఎంఏహెచ్ మాసివ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.

120 వాట్ ఛార్జింగ్ కెపాసిటీతో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఫీచర్స్ తో మొత్తం 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో సోనీ 50 మెగా పిక్సెల్ ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంది.

కాల్స్ కోసం 37 గంటలు, చాటింగ్ కోసం 24 గంటలు, వీడియోలు చూసేందుకు అయితే 23 గంటలు, వీడియో గేమ్స్ ఆడేట్టు అయితే 8 గంటలు కంటిన్యూగా బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది.

ఇది రెండు రంగుల్లో లభిస్తుంది. ఒకటి రేజర్ గ్రీన్, మరొకటి ఫ్లూయిడ్ సిల్వర్. దీని ధర 2 వేల ఎక్స్ ఛేంజ్ తో వేరియంట్ ని బట్టి రూ. 24,999 నుంచి రూ. 33,999 వరకూ ఉంది.