వానాకాలంలో మలేరియా కట్టడికి ఈ దినుసులు బ్రహ్మాస్త్రాలు

వర్షాకాలం మొదలైంది. జోరు వానలు కురుస్తున్నాయి.

ఇక వానాకాలంలో అంటు వ్యాధులు, సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి.

వర్షాకాలంలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో.. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు వస్తాయి.

వానాకాలంలో మలేరియా కట్టడికి మన వంటింట్లోనే బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి.

వేడినీటిలో దాల్చిన చెక్క, నల్ల మిరియాల పొడిని వేసి తాగాలి.

దీన్ని రోజుకు ఒకటి, రెండుసార్లు తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

పసుపులో అద్భుతమైన యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-మైక్రోబయల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.

ప్లాస్మోడియం ఇన్ఫెక్షన్ కారణంగా శరీరంలో పేరుకున్న విష పదార్థాలను తొలగించడంలో పసుపు సాయం చేస్తుంది.

మీకు మలేరియా ఉంటే భోజనాల మధ్య ఆరెంజ్ జ్యూస్‌ తీసుకోవాలి.

దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఆరెంజ్ జ్యూస్ జ్వరాన్ని తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ వాడకంతో మలేరియా  జ్వరాన్ని తగ్గించుకోవచ్చు.

నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి దానిలో ఒక టవల్ నానబెట్టండి.

దాన్ని బయటకు తీసి పిండి.. పది నిమిషాలు, మీ నుదిటిపై ఉంచండి.

మలేరియా కట్టడికి తులసిని తరచుగా ఉపయోగిస్తారు.

తులసిలోని యూజీనాల్, బాక్టీరియా వ్యాధుల నిర్మూలనలో సాయం చేస్తుంది.

తులసి, మిరియాల పొడితో కలిపి తింటే ఆరోగ్యాన్ని మెరుగవుతుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం