మూతి చుట్టూ నల్లగా ఉందా.. అయితే పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఈ టిప్స్ తో పోవాల్సిందే!

మహిళలు చర్మ సౌందర్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికి తెలిసిందే.

ముఖ్యంగా ముఖంపై మొటిమలు కానీ, నల్లటి మచ్చలు  కానీ ఉంటే చాలు వాటి కోసం పార్లర్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి క్రిమ్స్ ను కొనుగోలు చేస్తుంటారు.

అయితే చాలామంది మహిళలకు ముఖం ఒక రంగులో మూతి ఒక రంగులో కనిపిస్తూ ఉంటుంది.

దీని వలన బయటకు వెళ్లలంటేనే ఇబ్బందిపడుతుంటారు.అందుకోసం చాలామంది రకరకాల క్రీమ్స్ వాడుతుంటారు.

అయితే ఇలా ఎన్ని క్రీమ్స్ వాడిన నలుపు రంగు పోవకపోవడంతో అలాంటప్పుడు సింపుల్ గా ఈ చిట్కాను ట్రై చేసి చూడండి.

ఇంట్లో ఉండే పాలల్లో మీగడను తీసి,ఆ మీగడలో పసుపు వేసి మూతి చుట్టూ రాస్తే ఆ నలుపును తగ్గించవచ్చు.

అలాగే మీగడలో కొద్దిగా పసుపు, కొద్దిగా శనగ పిండి కలిపి పేస్టులా చేసుకోని మూతి చూట్టూ రాసి మర్దనా చేసినా ఆ నలుపును తగ్గించవచ్చు.

దీంతో పాటు కలబందతో కూడా మూతి చుట్టూ ఉండే నలుపును పోగొట్టుకోవచ్చు.

ఇక ప్రతిరోజు మూతి చుట్టూ రోజ్ వాటర్ రాసినా ఆ నలుపును తొలగించవచ్చు.

అలాగే బంగాళ దుంప రసాన్ని కూడా మూతి చుట్టూ రాసి మర్దనా చేస్తే తెల్లగా వచ్చే అవకాశం ఉంటుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం