పెరుగు ఏ సమయంలో తింటే ఎక్కువ మేలు జరుగుతుందో తెలుసా?

పెరుగును రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఎన్నో పోషకాలను కలిగిన పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.

పెరుగులో ప్రొటీన్లు ఎక్కువగా, కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌ కొద్ది పరిమాణంలో ఉంటాయి.

పెరుగును తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది.

పెరుగును ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.

పెరుగును అన్నంలో కలుపుకుని తింటుంటారు.

పెరుగు తినడానికి మధ్యాహ్న సమయం.. అదీ భోజనం తర్వాత అనువైనది.

తిన్న తర్వాత పెరుగు తీసుకోవడం వల్ల అరుగుదల సాఫీగా జరిగిపోతుంది.

పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్‌ పొట్టలో మంచి బ్యాక్టీరియాను సమతూకంలో ఉంచుతాయి.

రాత్రిళ్లు పెరుగు తినకూడదు. ఇది నిద్రకు చేటుచేస్తుంది. పొట్టలో సమస్యలకు కారణమవుతుంది.

గమనిక  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం