శీతాకాలంలో ఈ పండ్లను తింటే.. ఆరోగ్యం మీ సొంతం!

సాధారణంగా శీతాకాలంలో రక రకాల వ్యాధులు వ్యాపిస్తుంటాయి.

ఈ సీజన్ లో వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు, కీళ్ల నొప్పుల ముప్పు పొంచి ఉంటుంది.

శీతాకాలంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే పండ్ల తినాలని అంటున్నారు వైద్య నిపుణులు

పండ్లు, జ్యూస్ మార్కెట్ లో విరివిగా లభిస్తాయి.

ఆరోగ్యంగా ఫిట్ నెస్ గా ఉండాలంటే.. నారింజ, దానిమ్మ, యాపిల్స్, ఖర్జూరం తో పాటు ఇతర పండ్లు తినాలి

నారింజ పండ్లలో ఆంథోసైనిన్లు, విటమిన్ సి, చర్మాన్ని, గుండెను ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచుతాయి.

ఖర్జూరం తక్కువ బరువు ఉన్నవారు బరువు పెరుగుతారు, జీర్ణ క్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.

ద్రాక్ష పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఎ,బి2, బి1 విటమిన్లు పుష్కలంగా ఉంటాయి

దానిమ్మ.. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.. మిమ్మల్ని ఆరోగ్యంగా రక్షిస్తుంది.

అరటి పండు.. అధిక బీపీ తో బాధపడే వారికి ఇది చక్కటి ఔషదం.. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.

యాపిల్స్...  శీతాకాలంలో ఆకలిని అరికడుతుంది.. వ్యాధులతో పోరాడుతుంది.

క్రాన్బెర్రీస్ ఎర్రటి బెర్రీలు శీతాకాలంలో తింటే కొలెస్ట్రాల్ కి చెక్ పెట్టవొచ్చు.