శీతకాలంలో కీళ్ల నొప్పి పోవాలన్నా, దృఢత్వం కావాలన్నా వీటిని తీసుకోవాలి

పేదల బాదంపప్పుగా ప్రసిద్ది చెందిన వేరుశెనగ అంటే చాలా మందికి ఇష్టం.

తృణ ధాన్యల్లో ఒకటైన వేరుశనగ ఈ సీజన్ లో పుష్కలంగా లభిస్తుంది.

వేరుశనగలో రుచితో పాటు శరీరానికి అవసరమైన అదనపు విటమిన్, ప్రోటీన్లు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి.

నాన్‌ వెజ్‌ తినడం ఇష్టం లేని వాళ్లు వేరు శెనగలు తింటే… మాంసం లో ఉండే పోషకాలు దీనిలో  లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

అంతేకాకుండా.. పరగడుపుతో వెరుశనగను తింటే గ్యాస్ ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.

వేరుశనగను  రోజంతా నాన బెట్టి తింటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, రాగి, ఐరన్, పొటాషియం, సెలీనియం, జింక్‌ ,కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా దొరుకుతాయి.

ఇక ప్రతిరోజు వేరుశనగను తినడం వలన జ్ఞాపక శక్తితో పాటు కంటి చూపును మెరుగు పరచడంలో తోడ్పడుంది.

అలాగే వేరుశనగలు తింటే ఎముకలు, చర్మం ,జుట్టు ఆరోగ్యకరంగా ఉంచడంలో చక్కగా సహాయపడుతుంది.

దీనిని ప్రతిరోజు తినడం వలన ఇందులో ఉండే మెగ్నీషియం జీవక్రియ వ్యవస్థను మెరుగు పరస్తుంది.

రోజుకు 25.8 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉన్న 100 గ్రాముల వేరు శెనగలను తింటే శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ సమభాగల్లో అందుతయని నిపుణులు చెప్తుతున్నారు.

వేరుశెనగలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది బరువు తగ్గడంలో మేలు చేస్తుంది.

అయితే రాత్రిపూట మాత్రం వేరుశనగను తినకూడదని చాలామంది సలహా ఇస్తుంటారు.