బరువు పెరగాలా? ఈ ఫుడ్ తీసుకోండి.. వద్దన్నా పెరుగుతారు

బరువు పెరగాలంటే శరీరానికి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, హెల్దీ ఫ్యాట్, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం, కార్బోహైడ్రేట్లు ఉన్న ఫుడ్, హెల్దీ స్నాక్స్ తీసుకోవాలి.     

చికెన్, సాల్మన్, ట్యూనా టిలాపియా వంటి చేపలు, గుడ్లు,  పెరుగు, బాదంపప్పు, చియా విత్తనాలు, బఠాణీ వంటి వాటిలో రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి.  

ప్రోటీన్ రిచ్ ఫుడ్స్:

సాల్మన్, ట్యూనా, మాకేరెల్ చేపల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి బరువుని పెంచేందుకు ఉపయోగపడతాయి.

హెల్దీ కొవ్వు:

అలానే అవకాడో, ఆలివ్ ఆయిల్, చియా విత్తనాలు, అవిసె గింజలు వంటి వాటిలో కూడా హెల్దీ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది.

బ్రౌన్ రైస్, గోధుమ రొట్టె, స్వీట్ పొటాటో, అరటిపండ్లు, బెర్రీ, యాపిల్స్, పాలకూర, బ్రోకల్లి, క్యారెట్ వంటి వాటిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.

కార్బోహైడ్రేట్స్:

ఖర్జూరం, నేరేడు పండ్లు, అరటిపండ్లు, బెర్రీ ఫ్రూట్, యాపిల్స్ లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి.

క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం:

ప్రోటీన్ పౌడర్, అరటిపండు, పాలకూర మిక్స్ చేసి చేసిన స్మూతీస్ తీసుకోవాలి. గోధుమ రొట్టెతో చేసిన పీనట్ బటర్, జెల్లీ శాండ్ విచ్ తింటే బరువు పెరుగుతారు.

బాదం వెన్నతో కలిపి యాపిల్ ముక్కలను తింటే బరువు పెరుగుతారు. అలానే తేనె, నట్స్ తో కలిపి పెరుగు తీసుకుంటే బరువు పెరుగుతారు.  

ఓట్స్, నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ ఎనర్జీ బాల్స్ గా పని చేస్తాయి. ప్రోటీన్ షేక్స్ కూడా బరువు పెరిగేందుకు తోడ్పడతాయి.

ఛీజ్, గోధుమ రొట్టెతో చేసిన శాండ్ విచ్ బరువు పెరిగేందుకు ఉపయోగపడతాయి.

ఇది అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. కాబట్టి ఈ టిప్స్ పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించాలి.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం