ఒత్తిడిని దూరం చేసే ఆహారపదార్థాలు ఇవే..

ఈ కాలంలో జీవితం అంతా ఉరుకుల పరుగులతోనే సరిపోతుంది.. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

ఒత్తిడి వల్ల శారీర, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి.

తీవ్రమైన ఒత్తడి వల్ల మనిషి ప్రశాంతంగా గడపలేడు.. దీంతో అనారోగ్యం భారిన పడుతున్నారు.

యోగ, వ్యాయామం లాంటివి చేస్తే కొంతవరకు ఒత్తిడికి దూరమవొచ్చు. 

కొన్ని ఆహార పదార్ధాలు తీసుకుంటే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు అంటనున్నారు వైద్య నిపుణులు

వేరుశనగ గుళ్ళు నానబెట్టి తింటే.. అందులో మెగ్నిషియం, విటమిన్ బి 6 తో మంచి జ్ఞాపక శక్తి పెరిగి ఒత్తిడి తగ్గుతుంది.

బొప్పాయిలో ఉండే కెరోటిన్ శరీరం, మనసు తేలికపడేలా చేసి ఒత్తిడి తగ్గిస్తుంది.

నిమ్మజాతికి చెందినవి తీసుకుంటే.. ఇందులో ఉండే విటమిన్ సీ ఒత్తిడి ప్రభావం చేసే హార్మోన్లను కంట్రోల్ చేస్తుంది.

అరటిపండులో మంచి క్యాలరీలు ఉంటాయి. ఇందులో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఆలుగడ్డలో ఉండే జింగ్, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

గోదుమలో ఉండే ఐరెన్ మెదడుకు ఆక్సీజన్ ను సరఫరా చేసి తీవ్ర ఒత్తిడిని తగ్గిస్తుంది.

కొన్నిరకాల చాక్లెట్స్ కూడా మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి.

చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శారీరక, మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గిస్తాయి.