Tooltip

ఇవి తిని మతిమరుపును పొగొట్టుకోండి!

Tooltip

మతిమరుపు.. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందర్ని వేధిస్తున్న సమస్య

Tooltip

గతంలో అయితే కేవలం వయస్సు పైబడిన వారిలోనే కనిపించేది.

Tooltip

కానీ, ఈ రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మతిమరుపుతో బాధపడుతున్నారు.

Tooltip

చేయాల్సిన పనులు, పెట్టిన వస్తువులు మర్చిపోతూ.. తెగ ఇబ్బంది పడుతుంటారు.

Tooltip

ఇలా మతిమరుపుతో బాధపడే వారు.. ఈ ఆహార పదార్ధాలు తింటే.. మతిమరుపును దూరం చేయొచ్చు.

Tooltip

చేపలు.. చేపల్లో ఎక్కువగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభిస్తాయి.

Tooltip

ఇది మెదడుకు ఎంతో ఆరోగ్యకరం. చేపలు తినడం వల్ల మతిమరుపు తగ్గుతుంది.

Tooltip

బ్రోకలీ.. దీని వల్ల మెదడు చాలా యాక్టీవ్‌గా ఉంటుంది.

Tooltip

బ్రోకలీని సలాడ్స్‌లో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో యాడ్‌ చేసుకుని తింటే చాలా మంచిది.

Tooltip

డార్క్‌ చాక్లెట్‌.. ఇందులో కెఫిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనయిడ్లు మెండుగా ఉంటాయి.

Tooltip

డార్క్‌ చాక్లెట్‌ తినడం వల్ల జ్ఞాపక శక్తి, అభిజ్ఞా అభివృద్ధిని మెరుగు పరుస్తుంది.

Tooltip

పసుపు.. దీన్ని యాంటీ బ్యాక్టీరియాగా చెప్పుకుంటాం. మన తినే ఆహారాల్లో పసుపు సరిపడ ఉండేలా చూసుకోండి.

Tooltip

పసుపులో వ్యాధి నిరోధక శక్తి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Tooltip

పసుపు వల్ల జ్ఞాపకశక్తి పెరుగుదలతో పాటు మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

Tooltip

మరి ఇంకెందుకు ఆలస్యం.. మీకు మతిమరుపు ఉన్నా లేకపోయినా.. పైన చెప్పిన పదార్థాలు తినడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని పెంచుకోండి.