కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి!

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.  మారుతున్న జీవనశైలి కారణంగా కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

చాలా మంది కంటి శుక్లం, అంధత్వం, కళ్ల మంటలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి వారు కళ్లకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కళ్ళు ఆరోగ్యంగా ఉంచడానికి ఆర్గానిక్ రోజ్ వాటర్ కనురెప్పలపై అద్దాలి. కంటి చికాకు నుంచి ఉపశమనం అందించడంతో పాటు, కళ్లకు చల్లదనాన్ని, సౌకర్యాన్ని అందిస్తుంది.

ఆవు నెయ్యిని కను రెప్పలపై రాసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు కళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. 

కాటుక మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీని కోసం మీరు ప్రతిరోజూ నిద్రిస్తున్నప్పుడు కళ్లకు కాటుకను రాసుకోవచ్చు.

నడక మీ కంటి చూపును ప్రకాశవంతంగా చేస్తుంది.

కళ్లను ప్రతిరోజూ కనీసం 10 నిమిషాల పాటు కుడి-ఎడమగా, పైకి క్రిందికి కదిలించండి.

రోజు సరియైన సమయం నిద్రిస్తే అది కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది.

కంటి చూపును మెరుగుపరచడానికి ఆకు కూరలు ఎంతో సహాయపడతాయి.

విటమిన్ ఎ, విటమిన్ సి, ఒమేగా కొవ్వు ఆమ్లాలు, జింక్ వంటి పోషకాలు కంటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

క్యారెట్లలో బీటా కెరోటిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు,  విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్ చాలా చాలా అవసరం.