కరివేపాకు టీ ఎప్పుడైనా తాగారా? ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

iDreampost.Com

iDreampost.Com

కరివేపాకును చాలా మంది లైట్ తీసుకుంటారు. కూరల్లో కరివేపాకు కనిపిస్తే తీసి పక్కనబెడతారు.

iDreampost.Com

కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే దాన్ని అస్సలు వదలరు.

iDreampost.Com

కరివేపాకు అనగానే కూరల్లో వేసేదిగానే చూస్తారు. కానీ దీన్ని టీగా చేసుకొని తాగొచ్చని చాలా మందికి తెలియదు.

iDreampost.Com

కరివేపాకు టీని ఎలా తయారు చేయాలి? దీని వల్ల కలిగే లాభాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

iDreampost.Com

ఒక గ్లాసు నీళ్లలో 20 నుంచి 30 కరివేపాకులను వేసి మరిగించాలి. నీళ్లు సగం మరిగిన అనంతరం అందులో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.

iDreampost.Com

కరివేపాకు టీ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

iDreampost.Com

ఇందులోని ఔషధ గుణాలు అనేక రోగాలతో ఫైట్ చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

iDreampost.Com

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి బాడీలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి.

iDreampost.Com

శరీర బరువును నియంత్రించే పోషకాలు కరివేపాకులో పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి.

iDreampost.Com

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కరివేపాకు సాయపడుతుంది. రోజూ ఈ టీ తీసుకుంటే జీర్ణ ఎంజైమ్స్ సరిగ్గా ఉత్పత్తి అవుతాయి.  

iDreampost.Com

జుట్టు ఆరోగ్యానికి కూడా కరివేపాకు టీ మంచిది. జుట్టు కుదుళ్లకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

iDreampost.Com

కరివేపాకు టీ తాగడం గర్భిణులకు మంచిదని నిపుణులు అంటున్నారు. వాంతులు, వికారం వంటి సమస్యలకు దీంతో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.

iDreampost.Com

ఇందులో కాల్షియం మెండుగా ఉంటుంది. దంతాలు, ఎముకల ఆరోగ్యానికి కరివేపాకు టీ తీసుకోవడం మంచి చేస్తుందని  ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

iDreampost.Com

కరివేపాకు టీ డైలీ తాగితే నరాల ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

iDreampost.Com

రోజంతా అలసిపోయిన వారు సాయంత్రం ఓ కప్పు కరివేపాకు టీ తాగితే ఫుల్  రిలాక్స్డ్ గా అనిపిస్తుంది.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం