ఏజ్ గ్యాప్ వల్ల కపుల్స్ కి కలిగే ప్రయోజనాలు!

ఒకప్పుడు భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండేది.

ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏజ్ గ్యాప్ అనేది తగ్గిపోతూ వస్తుంది.

భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ రెండు, మూడేళ్ళకి పడిపోయింది. కొన్ని సందర్భాల్లో భర్తల కంటే భార్యల వయసే ఎక్కువగా ఉంటుంది.

అయితే అసలు ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల వారి అనుభవాలను షేర్ చేసుకోవడానికి వీలవుతుంది.

ఏజ్ పెరిగే కొద్దీ మెచ్యూరిటీ, జ్ఞానం పెరుగుతాయి. చిన్నవాళ్లు పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే వీలుంటుంది.

ఒకరి నుంచి ఒకరు వేరు వేరు విషయాలను నేర్చుకోవచ్చు.

దంపతుల మధ్య వయసు వ్యత్యాసం ఉంటే రిలేషన్ షిప్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే వీలుంటుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం అనేది ఉంటుంది.

ఏజ్ గ్యాప్ వల్ల భాగస్వామిని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ సమస్యలను పరిష్కరించుకునే మానసిక పెరుగుదల అనేది ఏర్పడుతుంది.