నడక వల్ల లాభాలు.. ఏ వయస్సు వారు ఎంతదూరం నడవాలో తెలుసా?

మనిషికి మంచి ఆరోగ్యం కోసం ఆహారంతో పాటు నడక ముఖ్యమైనది.

రోజూ ఉదయాన్నే నడవడం కారణంగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

వాకింగ్ చేయడం కారణంగా అనేక వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. 

రోజూ ఉదయం, సాయంత్రం నడవడం వల్ల  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఈ నడక వల్ల ఎలాంటి వ్యాధులతోనైనా పోరాడే సత్తా మనకు అందిస్తుంది. 

వయస్సును బట్టి రోజూ ఎన్ని ఎంతసేపు నడవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

రోజూ 30 నుంచి 40 నిమిషాలు నడిస్తే శరీరంలోని అదనపు కేలరీలను తగ్గించుకోవచ్చు.

5 నుంచి 10 ఏళ్ల వారు రోజుకు 10-15 వేల అడుగులు వేయాలని నిపుణులు చెబుతున్నారు.

11 నుంచి 40 ఏళ్ల వారు రోజుకు 12 వేల అడుగులు నడవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఒక వ్యక్తి 40 ఏళ్ల వయస్సులో రోజూ 11,000 అడుగులు నడిస్తే మంచింది.

అదే విధంగా 50 ఏళ్ల వయస్సులోని వారు 10,000 అడుగులు వేయడం ఆరోగ్యానికి మంచిదట.

60 ఏళ్ల వయస్సులో 8,000 అడుగులు వేయాలని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. 

పై అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది.

ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండం మంచింది.