వేప పుల్లతో పళ్ళు తోముకోవడం వలన కలిగే ప్రయోజనాలు..

టూత్ బ్రష్ తో పాటు వేప పుల్లను కూడా  పళ్ళు తోముకోడానికి అప్పుడప్పుడు వినియోగిస్తూ ఉండాలి.

దీని వలన  దంత సమస్యలు రాకుండా ఉంటాయి. 

వేప పుల్లతో నెలకు ఒకసారి అయినా తోముకుంటే మంచిది. 

ఎందుకంటే వేప చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి.

వేప పుల్లతో బ్రష్ చేయటం వలన దంతాల్లోని బ్యాక్టీరియా చనిపోతుంది. 

అలాగే నోటిపూత సమస్య ఉన్నా కూడా వేప పుల్లతో  బ్రష్ చేసుకుంటే నయం అవుతుంది. 

పైగా వేప పుల్లతో క్రమం తప్పకుండా బ్రష్ చేయటం వలన ముఖం కూడా  కాంతివంతంగా తయారవుతుందట. 

ఇలా ప్రకృతి ప్రసాదించిన ఔషధాలలో ఒకటైన వేపపుల్లను వాడితే  ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.