గ్లూ బెర్రీ పండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా? తెలిస్తే ఎగబడి తింటారు.

గ్లూ బెర్రీ పండ్లు అంటే చాలా మందికి తెలీక పోవచ్చు. వీటిని వాడుక బాషలో ఇరికి పండ్లు, బంక కాయ, నెక్కర కాయలు అంటారు.

పల్లెటూర్లలో విరివిరిగా ఈ చెట్లు ఉంటాయి. అక్కడ ఫ్రీగా వీటిని తినొచ్చు కూడా.

ఇక ఈ గ్లూ బెర్రీ పండ్లను తినడం వల్ల మీరు ఊహించని ఆరోగ్య లాభాలు పొందుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ పండ్లలో కాల్షియం, ఫైబర్, కొవ్వు, కార్బోహైడ్రేట్స్ తో పాటుగా పాస్పరస్, ప్రోటీన్స్ ఉంటాయి.  

వీటిని తినడం వల్ల మోకాళ్లలో అరిగిపోయిన గుజ్జు మళ్లీ వస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ పండ్ల గుజ్జును తలకు పట్టిస్తే.. మైగ్రేయిన్ తగ్గుతుంది.

ఇవి పురుషుల ఆరోగ్యానికి ఎంతగానో సహాయం చేస్తాయి.

గ్లూ బెర్రీ పండ్లకు డయాబెటిస్ ను అదుపులో ఉంచే గుణం ఉంటుంది.

మలబద్దకం, గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలకు ఈ పండ్లు చెక్ పెడతాయి.

వర్షా కాలంలో వచ్చే చర్మ సమస్యలను తొలగించే శక్తి వీటికి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం