శీతకాలంలో ఈ టీని తీసుకుంటే సీజనల్  ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది. 

మన వంటింట్లో నిత్యం అందుబాటులోఉండే మసాలా దినుసుల్లో ఒకటి లవంగాలు. ఇవి ఆహారం రుచి, సువాసనను పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ఈ లవంగాలు జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా.. గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

వీటిలో యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కావునా, లవంగాలను నీటిలో మరిగించి, లేదా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ లవంగాలలో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ ఇ, సి లాంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. 

అంతేకాకుండా.. కాలేయ వ్యాధులు, డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంచడానికి లవంగాలు ఎంతగానో తోడ్పడతాయి.

పంటి నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు లవంగాలు సహాయపడతాయి. వీలైతే లవంగం నూనె కూడా ఉపయోగించవచ్చు.

లవంగాలు కడుపు నొప్పిని నివారించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే పరిమితికి మించి వీటిని తీసుకొకూడదు.

లవంగం టీలో క్రిమినాశక గుణాలు ఉన్నందున ఎలాంటి చర్మ వ్యాధిని అయినా తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇక ఈ లవంగం టీ తాగితే జ్వరం తగ్గించడంలో కూడా సహయపడుతుంది.

అయితే, లవంగాలలో వేడి స్వభావం ఎక్కువగా ఉంటుది కావునా, వీటిని శీతాకాలంలో తీసుకుంటే.. చాలా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.