వర్షాకాలంలో తెలుగు రాష్ట్రాల్లో చూడాల్సిన జలపాతాలు!

బొగత జలపాతం :

ములుగు జిల్లాలో ఉన్నఈ జలపాతాన్ని నయాగార జలపాతం అని కూడా అంటారు. జల పాతం చుట్టూ పచ్చని చెట్లు, పక్షులు ఎంతో అందంగా ఉంటుంది.

ఈ జలపాతం హైదరాబాద్ నుంచి 281 కిలో మీటర్ల దూరంలో ఉంది.

కుంటాల జలపాతం :

ఆదిలాబాద్ జిల్లా నేరేడికొండ కడం ప్రాజెక్ట్ పై ఉంది. భూమికి 150 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ జలపాతం దట్టమైన అడవుల్లో ఉంది. 

ఇక్కడికి ట్రెక్కింక్ వస్తుంటారు.ఈ జలపాతం హైదరాబాద్ నుంచి 271 కిలో మీటర్ల దూరంలో ఉంది.

తలకోన జలపాతం:

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ జలపాతం దేశంలోనే ఫేమస్. తిరుపతికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.  ఎత్తైన కొండలు, దట్టమైన అరణ్యప్రాంతాల్లో ఎంతో అందంగా ఉంటుంది.

ఇక్కడ ఎక్కువ సినిమా షూటింగ్స్ జరుగుతాయి. 

మల్లెల తీరం జలపాతం: 

 తెలంగాణలోని నాగర్ కర్నూల్ లోని మ్రాబాద్ మండలంలో ఉన్న దట్టమైన అడవుల్లో ఉంది.

ఇక్కడ నల్లమల అడవుల గుండా కృష్ణా నది ప్రవహిస్తుంది.ఈ జలపాతం హైదరాబాద్ నుంచి 185 కిలో మీటర్ల దూరంలో ఉంది.

గాయత్రి జలపాతం :

తెలంగాణలోని నిర్మల్ పట్టణంలో ఉన్న అనేక జలపాతాల్లో గాయత్రి జలపాతం ఒకటి. 70 మీటర్ల ఎత్తులో రాతి  కొండ నుంచి జాలువారే ఈ జలపాతం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. 

హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిలో మీటర్ల దూరంలో ఉంది. 

భైరవ కోన జలపాతం:

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఉన్న భైరవ కోన జలపాతం వర్షాల సీజన్ లో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ శైవ క్షేత్రం ప్రసిద్ది పొందింది.

కటిక జలపాతం :

 విశాఖలో ఉన్న ఉన్న కటిక జలపాతం 50 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహిస్తుంది. బొర్రా గుహల నుంచి 5 కిలో మీటర్ల దూరం.

అరకు సమీపంలో ఈ అందమైన జలపాతం ఉంది. ఈ జలపాతం చుట్టు సహజ సిద్దమైన ప్రకృతి అందాలు చూస్తుంటే ఆనందంతో పరవశించిపోతారు